మేడ్చ‌ల్‌లో నకిలీ వైన్ దందా.. తయారీదారుడి అరెస్ట్

క‌లం, వెబ్ డెస్క్‌: మేడ్చ‌ల్ (Medchal) జిల్లాలోని కాప్రాలో అక్రమ నకిలీ వైన్ (Illegal Wine) త‌యారీ క‌ల‌క‌లం రేపింది. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు బుధ‌వారం నిర్వ‌హించిన‌ మెరుపు దాడుల్లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. స్థానికంగా ఆంథోని పీట‌ర్ అనే వ్య‌క్తి ఎలాంటి అనుమ‌తులు లేకుండా ఈ నకిలీ వైన్ త‌యారీ చేస్తున్న‌ట్లు అధికారులు గుర్తించారు. దీని కోసం ఏడు ర‌కాల పండ్ల‌ను వాడుతున్న‌ట్లు వెల్ల‌డించారు.

వైన్ త‌యారీ స్థావ‌రంలో అధికారులు 377.7 లీట‌ర్ల నకిలీ వైన్‌, 502 బాటిళ్ల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్నిసీజ్ చేసిన‌ట్లు తెలిపారు. నిర్వాహ‌కుడు ఆంథోనిని పోలీసులు అరెస్ట్ చేశారు. అస‌లు ఆంథోనీ ఎప్ప‌టి నుంచి ఈ దందా చేస్తున్నాడు, దీని వెనుక ఎవ‌రెవ‌రు ఉన్నారు అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Read Also: 35 దాటిన మహిళల్లో ఇన్ఫెర్టిలిటీ ముప్పు.. కారణాలివే!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>