Mobile Popup Ad
Mobile Popup Ad

హైకోర్టు స్టే ఆర్డరులున్నా నిర్మాణాలు.. హెచ్చరించిన హైడ్రా కమిషనర్

కలం, వెబ్ డెస్క్ : కోర్టు ఉత్త‌ర్వుల‌ను ఉల్లంఘించి ప‌లు నిర్మాణాలు చేప‌ట్ట‌డంపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామని హైడ్రా (HYDRAA) క‌మిష‌న‌ర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) హెచ్చ‌రించారు. గ‌చ్చిబౌలి జంక్ష‌న్‌లోని ఎఫ్‌సీఐ(ఫెర్టిలై జర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ) లే ఔట్‌ను రంగ‌నాథ్, సీఎంసీ క‌మిష‌న‌ర్ సృజ‌నతో కలిసి బుధ‌వారం సంద‌ర్శించారు.

హై కోర్టు స్టే ఆర్డ‌ర్‌ను ప‌ట్టించుకోకుండా ఈ లే ఔట్‌లో సంధ్యాశ్రీ‌ధ‌ర్ రావు నిర్మాణాలు జ‌రుపుతున్నార‌ని అక్క‌డి ప్లాట్ల య‌జ‌మానులు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు పరిశీలన చేపట్టారు. లే ఔట్‌లోని రహదారులు, పార్కుల హ‌ద్దులను చెరిపేసి త‌వ్వ‌కాలు చేయ‌డం, మ‌ట్టి పోయ‌డంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్ (AV Ranganath) మాట్లాడుతూ, సంధ్యా క‌న్వెన్ష‌న్ య‌జ‌మాని శ్రీ‌ధ‌ర్‌రావు చేస్తున్నారంటూ లే ఔట్‌లోని ప‌లువురు ప్లాట్ య‌జ‌మానులు హైడ్రా (HYDRAA) ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు.

లే ఔట్‌లోని ర‌హ‌దారులు, పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడినట్టు చెప్పారు. తర్వాత ఈ విష‌యం హైకోర్టుకు వద్దకు వెళ్లగా ఉత్త‌ర్వులు వచ్చాయన్నారు. కోర్టు ఉత్త‌ర్వులు ప్ర‌కారం ఇక్క‌డ ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్ట‌రాద‌ని స్ప‌ష్టంగా ఉన్నా.. సంధ్యా శ్రీ‌ధర్ రావు ఇక్క‌డ నిర్మాణాలు కొన‌సాగించడంపై ప్లాట్ య‌జ‌మానులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఇక్క‌డికి వ‌చ్చినట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు, సీఎంసీ అధికారులు, జోన‌ల్ క‌మిష‌న‌ర్‌, టౌన్‌ప్లానింగ్ అధికారులు కూడా అధికారుల ఉన్నారు.

Read Also: అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ వాళ్లకు చుక్కలు చూపిస్తాం: హరీశ్ రావు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>