తండ్రి చనిపోయిన బాధ‌లోనూ ప‌రీక్ష‌కు హాజ‌రు!

కలం, మెదక్ బ్యూరో: ఒకవైపు జీవితంలో ఎంతో ముఖ్య‌మైన ప‌రీక్ష‌లు.. మ‌రో వైపు తండ్రి అకాల మ‌ర‌ణం.. అంతులేని బాధ‌ను గుండెల్లోనే దాచుకొని ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యాడు ఓ విద్యార్థి. ఈ ఘ‌ట‌న మెద‌క్(Medak) జిల్లాలో చోటు చేసుకుంది. తండ్రి చనిపోయిన పుట్టెడు దుఃఖంలో సైతం పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు ఓ కొడుకు. వివరాల్లోకి వెళ్తే.. శుక్ర‌వారం రాత్రి ఉసిరికపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో శివంపేట మండ‌లం పాంబండ గ్రామానికి చెందిన నాగరాజు(45) మృతి చెందాడు. నేడు నాగరాజు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల్సి ఉంది. నాగ‌రాజు కొడుకు ధ‌నుష్ ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఈ రోజే పరీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. తండ్రి మృతి చెందిన బాధ‌ను దిగమింగుకొని ధ‌నుష్‌ పరీక్ష రాసేందుకు వెళ్లాడు. నాగ‌రాజు మృతితో పాంబండ‌లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. బంధువులు క‌న్నీళ్లు పెట్టుకుంటూ ధ‌నుష్‌ను ప‌రీక్ష కేంద్రానికి పంపించారు.

Read Also: చమురు కేంద్రాలపై దాడి: ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>