కలం, వెబ్ డెస్క్: జనసేన (Janasena) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. స్థానికంగా జనసేన పార్టీ జెండావిష్కరణ కార్యక్రమం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. పేర్ని నాని ఇంటి వద్దే వైసీపీ కార్యాలయం ఉండటంతో అటువైపు ఎవరూ రాకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
అయితే తన ఇంట్లోకి పని మనుషులను కూడా రానివ్వడం లేదంటూ పేర్ని నాని (Perni Nani) పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ స్థానికంగా సెక్షన్ 30 అమలులో ఉందని సమాధానమిచ్చారు. జనసేన కార్యక్రమానికి వర్తించని సెక్షన్‌లు తమకు ఎలా వర్తిస్తాయని నాని పోలీసులను ప్రశ్నించారు. అసలు సెక్షన్ 30 ఎందుకు అమలు చేస్తున్నారని నాని పోలీసులను నిలదీశారు. నోటి మాట చెప్తే కుదరదని, ఆర్డర్ కాపీలు చూపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, పేర్ని నానికి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి.
Read Also: సోనమ్ వాంగ్ చుక్ నిర్భందం రద్దు
Follow Us On: X(Twitter)

