కలం, వెబ్ డెస్క్ : అమెరికా, ఇరాన్ (US – Iran) మధ్య యుద్ధం తారస్థాయికి చేరింది. ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ ముడి చమురు ఎగుమతులకు ప్రధాన కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్‌పై అమెరికా దాడులు చేసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఖార్గ్ ఐలాండ్‌లోని ప్రతి సైనిక కేంద్రాన్ని అమెరికా దళాలు ధ్వంసం చేశాయని ట్రంప్ ప్రకటించారు. దీనిని ఇరాన్ యొక్క ‘క్రౌన్ జువెల్’ (కిరీటంలో మణి) గా ఆయన అభివర్ణించారు.
తాజాగా ఖార్గ్ ఐలాండ్‌పై అమెరికా చేసిన దాడిపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ చమురు కేంద్రాలపై దాడులు చేస్తే సహించమని తెలిపింది. తమ చమురు కేంద్రాలను ధ్వంసం చేస్తే ఊరుకోమని.. దీనికి తీవ్ర తీవ్ర పరిణామలను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది. అంతేకాదు గల్ఫ్ దేశాల్లోని అన్ని చమురు కేంద్రాలను లేపేస్తామని.. అన్నింటిని బూడిద కుప్పలుగా మార్చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

