కలం, మెదక్ బ్యూరో: దుబ్బాక (Dubbak) ప్రాంతానికి మొదటి శత్రువు హరీశ్‌రావేనని, ఈ ప్రాంత నిధులను మొత్తం సిద్దిపేట తీసుకువెళ్ళి.. దుబ్బాకకు అన్యాయం చేశాడని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) ఫైర్ అయ్యారు. సిద్దిపేటలో ఒక్క కోమటి చెరువు అభివృద్ధికే వంద కోట్లు ఖర్చు చేశాడని.. దుబ్బాకకు కనీస మౌలిక సదుపాయాలు కోసం నిధులు, కాలేజ్‌లు ఇవ్వలేదన్నారు. మాయమాటలు చెప్పుకుంటూ ప్రచారం కోసం వచ్చే హారీశ్‌రావు (Harish Rao) ను నిలదీయండి అంటూ ఎంపీ రఘునందన్ దుబ్బాక ప్రజలకు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ రఘునందన్ రావు పలు వార్డులలో ప్రచారం నిర్వహించారు.
Read Also: రేవంత్ డైరెక్షన్‌లోనే ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం : హరీశ్ రావు
Follow Us On: Instagram


