Mobile Popup Ad
Mobile Popup Ad

రేవంత్ డైరెక్షన్‌లోనే ఫోరెన్సిక్ ల్యాబ్ ప్ర‌మాదం : హరీశ్‌ రావు

కలం, మెదక్ బ్యూరో: ఓటుకు నోటు కేసులో జైలుకు పోతానన్న భయంతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాంప‌ల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో (Nampally FSL) ఉన్న ఆ కేసు ఆధారాలు చెరిపేశార‌ని మాజీ మంత్రి హ‌రీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. రేవంత్‌ డైరెక్షన్‌లోనే పోలీసులు కుట్ర‌కు పాల్ప‌డ్డార‌న్నారు. అంతా క‌లిసి ఫోరెన్సిక్ ల్యాబ్‌ను తగులబెట్టి ప్ర‌మాదంగా చిత్రీక‌రిస్తున్నార‌ని ఆరోపించారు. ఇది కేవ‌లం రేవంత్‌ జైలుకు పోకుండా ఉండటానికి సాక్షాలను దహనం చేసేందుకు చేశారని, ప్రమాదవశాత్తు జరిగిందని అంద‌ర్ని నమ్మించే యత్నం చేస్తున్నారని చెప్పారు. ఎన్ని చేసినా ఏ రోజుకైనా రేవంత్ జైలుకు వెళ్ల‌క తప్పదని హరీష్ వ్యాఖ్యానించారు. మెద‌క్ ప‌ట్ట‌ణంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా హ‌రీశ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు.

Read Also: ’మున్సిపల్‘ ప్రచారానికి తెర.. ప్రలోభాలకు ఏర్పాట్లు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>