Mobile Popup Ad
Mobile Popup Ad

అంబటికి రిమాండ్..!

క‌లం, వెబ్ డెస్క్‌: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబ‌టి రాంబాబు(Ambati Rambabu)కు గుంటూరు కోర్టులో చుక్కెదురైంది. త‌న‌పై న‌మోదైన కేసులు క్వాష్ చేయాల‌ని కోరుతూ ఆయ‌న దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను కోర్ట్ తోసిపుచ్చింది. అంబ‌టికి ఈ నెల 22 వ‌ర‌కు రిమాండ్(Remand) విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో పోలీసులు అంబ‌టిని రాజ‌మండ్రి జైలుకు త‌ర‌లించారు. అంబ‌టి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు న‌మోద‌య్యాయి.

వీటిలో నగరంపాలెం, పట్టాభిపురం పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల‌ను క్వాష్‌ చేయాలని కోరుతూ అంబటి రాంబాబు (Ambati Rambabu) కోర్ట్‌లో పిటిషన్ దాఖ‌లు చేశారు. న‌వంబ‌ర్ 12న మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేంకంగా వైసీపీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన పోరాటంలో అంబ‌టి పోలీసుల‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించారంటూ ప‌ట్టాభిపురం (Pattabhipuram) పీఎస్‌లో కేసు న‌మోదైంది. దీనిపై నేడు విచార‌ణ చేప‌ట్టిన కోర్టు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.

 Read Also: 2027 పుష్కరాల‌కు ముందే పోల‌వరం పూర్తి : సీఎం చంద్ర‌బాబు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>