Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రారంభానికి సిద్ధంగా ఇందిరా మహిళా శక్తి భవనం

కలం, మెదక్ బ్యూరో : మెదక్ (Medak) జిల్లా కేంద్రంలో రూ. 5 కోట్లతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనం ప్రారంభానికి సిద్ధమైంది. మహిళల శిక్షణకు, ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఈ భవనాన్ని ఉపయోగపడేలా లక్ష్యంతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

భవన నిర్మాణ ప్లాన్లు, గదుల నిర్మాణం, మౌలిక వసతుల పనులను పరిశీలించిన కలెక్టర్, పనుల పురోగతిని ప్రతిరోజూ పర్యవేక్షించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్ కార్యకలాపాలకు ఉపయోగపడే విధంగా భవనాన్ని తీర్చిదిద్దాలని కలెక్టర్ (Collector Pratima Singh) ఆదేశించారు. ఈ పరిశీలనలో పంచాయతీ రాజ్ ఈఈ నరసింహులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read Also: పేదలను సంతృప్తి పరిచేలా ఇండ్ల నిర్మాణాలు : మంత్రి పొంగులేటి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>