కలం, వెబ్ డెస్క్: లిక్కర్ స్కామ్ కేసులో (Liquor Scam) మాజీ సీఎం వైఎస్ జగన్‌కు శిక్ష తప్పదని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) అన్నారు.. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ కుంభకోణానికి సంబంధించిన విచారణ క్లైమాక్స్‌కు చేరుకుందన్నారు. ఇక కొద్ది రోజుల్లో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఈ కుంభకోణంలో దాదాపు రూ.3,000 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, తాడేపల్లి ప్యాలెస్ పెత్తందారుల కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. జగన్‌కు నీడలా ఉండే కే.నాగేశ్వర్ రెడ్డి కూడా ఈ స్కామ్‌లో కీలక భాగస్వామిగా ఉన్నారని, వివిధ వ్యక్తుల ఖాతాల్లోకి నిధులు ఎలా మళ్లాయో ఆధారాలన్నీ బయటకు వస్తున్నాయని పట్టాభి పేర్కొన్నారు.
జగన్ దంపతుల బ్యాంకు ఖాతాల లావాదేవీలు చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మాల్సిందేనని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా సొమ్ము చేసుకున్నారని పట్టాభి (Kommareddy Pattabhiram) విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు పేదరికం లేని సమాజం కోసం పీ 4 కార్యక్రమాన్ని ప్రారంభిస్తే, జగన్ మాత్రం పవర్, ప్రాపర్టీ, పైసా, పార్టనర్ షిప్ అనే మరో రకమైన పీ 4 సిద్ధాంతంతో దోచుకున్నారని ఎద్దేవా చేశారు. కే.నాగేశ్వర్ రెడ్డి, ఆయన భార్య ఖాతాల్లో 2019 నుంచి 2024 మధ్య కాలంలో రూ.20 కోట్ల లావాదేవీలు జరగడమే ఇందుకు నిదర్శనమని పట్టాభి వెల్లడించారు. త్వరలోనే ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
Read Also: లోకేశ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి: అంబటి రాంబాబు
Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

