కలం, కరీంనగర్ బ్యూరో: అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ (Alliance Club International), వాసుదేవా హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాసేవలో విశిష్ట సేవలందిస్తూ ఇటీవల పదోన్నతులు పొందిన అధికారులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపెల్లి ఆర్డీఓగా పదోన్నతి పొందిన రాజేశ్వరిని, సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందిన వీర తిరుపతిని శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమం కరీంనగర్ భగత్‌నగర్‌లోని ఆర్డీఓ స్వగృహంలో జరిగింది. డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న అధికారులను గుర్తించి సన్మానించడం అలయన్స్ క్లబ్ యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటని తెలిపారు.
పదోన్నతి పొందిన అధికారులు ప్రజలకు మరింత ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు. అలాగే స్వదేశీ సేవా సంస్థ అయిన అలయన్స్ క్లబ్‌లో (Alliance Club) చేరాలని ఆహ్వానించగా, వారు సంతోషంగా అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొంజర్ల మహేష్ (జిల్లా గవర్నర్), పుల్లల శ్యామ్, సుద్దపెల్లి ప్రసాద్ , సాగర్ రెడ్డి , పండుగ నాగరాజు , సుధాకర్, ఆనంద్ శర్మ , ఇంజనీర్ కొల అన్నారెడ్డి, ఇంజనీర్ ఈద కుమారస్వామి, నాగేశ్వర్, వెంకటేశ్వర్లు , పలువురు పీడీజీలు పాల్గొన్నారు.
Read Also: తెలంగాణలో త్వరలోనే ‘సర్’.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
Follow Us On : WhatsApp

