epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అతడి మరణానికి కెనడాదే బాధ్యత: భారత్​

కలం, వెబ్​డెస్క్​: ఆస్పత్రిలో నిర్లక్ష్యం కారణంగా కెనడా (Canada) లో భారత సంతతి వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం భారత ప్రభుత్వం స్పందించింది. అతడి మరణానికి కెనడాదే బాధ్యత అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్​ జైస్వాల్​ స్పష్టం చేశారు. మృతుడికి కెనడా పౌరసత్వం ఉందన్నారు. కాగా, కెనడాలోని ఎడ్మంటన్​ సిటీలో ప్రశాంత్​ శ్రీకుమార్​​ తన కుటుంబంతో కలసి నివసించేవారు. ఈ నెల 22న ఆఫీసులో పనిచేస్తుండగా ప్రశాంత్​కు ఛాతీలో నొప్పి ప్రారంభమైంది. వెంటనే అతడిని సహోద్యోగి దగ్గరలోని గ్రే నన్స్​ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడ దాదాపు 8 గంటల సేపు వెయిటింగ్​ రూమ్​లో కూర్చోబెట్టారు. అనంతరం ఈసీజీ చేశారు. అందులో అంతా నార్మల్​గా ఉందంటూ, నొప్పి నివారణకు మందు ఇచ్చి సరిపెట్టారు. సమాచారం అందడంతో ఆస్పత్రికి తండ్రి రాగా, తనకు నొప్పి తీవ్రంగా ఉందంటూ ప్రశాంత్​ వాపోయాడు. ఆ విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది దృష్టికి తండ్రి తీసుకెళ్లాడు. అయినా వాళ్లు పట్టించుకోలేదు. దీంతో ప్రశాంత్​ నొప్పితో విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాడు. ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంతానే తన భర్త మరణించాడని ప్రశాంత్​ భార్య నిహారిక వాపోయారు. ఈ విషయం సంచలనం సృష్టించడంతో భారత్​ స్పందించింది. ప్రశాంత్​ మరణానికి కెనడా(Canada) దే బాధ్యతని పేర్కొంది.

అమెరికా దృష్టికి హెచ్​1బీ అంశం:

హెచ్1బీ (H1B Visa) వీసాల జారీలో ఆలస్యం, ఇంటర్వ్యూ అపాయింట్​మెంట్ల రద్దుపై భారత ఆందోళనలను అమెరికా దృష్టికి తీసుకెళ్లినట్లు రణధీర్​ జైస్వాల్​ చెప్పారు. వీసా సమస్యలపై భారత టెకీలు, వారి కుటుంబ సభ్యుల నుంచి తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. అపాయింట్​మెంట్​ల షెడ్యూలింగ్​, రీషెడ్యూలింగ్​లో ఇబ్బందులు తెలెత్తుతున్న విషయాన్ని అమెరికా దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఈ అంశంపై అమెరికాదే పూర్తి అధికారం అయినప్పటికీ భారత ఆందోళనలను పరిశీలించమని చెప్పినట్లు జైస్వాల్​ పేర్కొన్నారు.

Read Also: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండించిన భారత్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>