Mobile Popup Ad
Mobile Popup Ad

కార్మికుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం.. విప్ వేముల

కలం, నకిరేకల్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే (May Day) సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గంలో వేడుకలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి కార్మికులతో కలిసి ఎమ్మెల్యే భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని మెయిన్ సెంటర్, ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతం, బస్టాండ్ ఆవరణం, గౌడ సంఘం భవనం వద్ద వివిధ కార్మిక సంఘాల జెండాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

ఎండను సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) మాట్లాడుతూ.. అమెరికాలోని చికాగోలో పనిగంటల తగ్గింపు కోసం కార్మికులు చేసిన పోరాట ఫలితమే నేటి మే డే అని ఆయన గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఆర్టీసీలో కార్మిక సంఘాలను రద్దు చేస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నిషేధాన్ని తొలగించారన్నారు. కార్మికులకు సంఘం పెట్టుకునే, సమ్మె చేసే ప్రజాస్వామ్య హక్కును కల్పించారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు.

రాష్ట్రం 9.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను అమలు చేస్తున్నామని వివరించారు. నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధిపై స్పందిస్తూ.. ఇప్పటికే 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, వచ్చే విడతలో నకిరేకల్ టౌన్‌లో ఇళ్లు లేని పేదల కోసం మరో 1000 ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ కార్మిక సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Read Also: షారుఖ్ ఖాన్ ఆటపై మురళీ కార్తీక్ అసంతృప్తి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>