ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి: మంత్రి అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర‌ పోషించిన ఆర్టీసీ కార్మికులు స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అనేక అవస్థలు పడ్డారని మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ (Adluri Laxman Kumar) అన్నారు. కార్మికులు సమ్మె చేస్తే డిస్మిస్ చేస్తానని నాటి సీఎం కేసీఆర్ హెచ్చరించారని గుర్తు చేశారు. మే డే వేడుకల్లో భాగంగా జగిత్యాల జిల్లాలోని ఆర్టీసీ బస్ డిపోలో నిర్వహించిన కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల సింగరేణి కార్మికుల పోరాట ప్రటిమ మరువలేనిదన్నారు. నాడు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం కనీసం చర్చలకు ఆహ్వానించలేదని విమ‌ర్శించారు.

ప్రజలు మార్పు కోరుకున్న ప్రజా ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కేవలం మూడు రోజుల్లోనే కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించామని మంత్రి (Adluri Laxman Kumar) అన్నారు. సీఎం ఆదేశాలతో ఐదుగురు మంత్రులు 24 సంఘాల ప్రతినిధులతో చర్చించి సమ్మెకు ముగింపు పలికామని మంత్రి తెలిపారు. కార్మికుల న్యాయమైన పరిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు అండగా నిలవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సోదరులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల ఆర్టీసీ కార్మి కుల సంఘం అధ్యక్షులు శంకర్ తోపాటు ఆర్టీసీ కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.

Read Also: కార్మికుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం.. విప్ వేముల

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>