కలం, నిజామాబాద్ బ్యూరో: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు (Sriram Sagar Project) 25 టీఎంసీలకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 1071.20 అడుగులు అంటే 25.353 టీఎంసీలకు చేరుకుంది. నాలుగు రోజుల కిందట కేవలం 16 టీఎంసీల నీటి నిల్వ ఉండేది. నాలుగు రోజుల వర్షాలతో ఏకంగా 9 టీఎంసీల వరద వచ్చి చేరింది. ప్రస్తుతం 40,380 క్యూసెక్కుల వరద వస్తోంది. అవుట్ ఫ్లో 822 క్యూసెక్కులుగా ఉంది. సాగు, తాగు నీటి కోసం అలాగే మిషన్ భగీరథ నీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నారు.

