కర్ణాటక సంచలనం: సోషల్ మీడియాపై నిషేధం

కలం, వెబ్​ డెస్క్​ : కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధాన సౌధలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సాంకేతిక రంగానికి పెద్దపీట వేయడంతో పాటు సామాజిక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

మొబైల్ ఫోన్ల మితిమీరిన వినియోగం వల్ల పిల్లలపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో మన దేశంలో సోషల్​ మీడియాను నిషేధించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఆస్ట్రేలియాలో మైనర్లకు సోషల్ మీడియాపై నిషేధం ఉండగా ఫిన్లాండ్, యూకే కూడా అమలుకు కసరత్తు చేస్తున్నాయని కర్ణాటక ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు.

బెంగళూరును ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్‌గా మరింత తీర్చిదిద్దేందుకు ఐఐఎస్సీ ఆధ్వర్యంలో భారీ ఏఐ మరియు టెక్ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఇస్రో, కియోనిక్స్ సహకారంతో ‘బెంగళూరు రోబోటిక్స్ అండ్ ఏఐ ఇన్నోవేషన్ జోన్’ పేరుతో ఒక అత్యాధునిక రోబోటిక్స్ క్యాంపస్‌ను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలోని సాంకేతిక నైపుణ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>