కలం వెబ్ డెస్క్ : సికింద్రాబాద్(Secunderabad)లో పండుగ పూట విషాదకర ఘటన జరిగింది. రాణిగంజ్‌లో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. అగ్ని నివారణ పరికరాలు నిలువ చేసే గోడౌన్(Warehouse)లో ఈ ఘటన జరిగింది. చుట్టు పక్కల వాళ్లు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల్లో అగ్నిమాపక పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనలో లక్షల్లో నష్టం జరిగినట్లు తెలుస్తోంది.


