epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మెగా బాక్సాఫీస్ మ్యాజిక్.. ఒక్క గంటలో 29 వేల టికెట్స్ బుకింగ్

కలం, వెబ్​ డెస్క్​: మెగాస్టార్​ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్​ కాంబినేషన్​లో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్‌ గారు (MSVPG) బాక్సాఫీస్​ వద్ద మంచి విజయం నమోదు చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. ఫస్ట్​ డే మంచి కలెక్షన్లు సాధించి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. వరుసగా సంక్రాంతి సెలవులు ఉండటంతో ఆన్​లైన్​ బుకింగ్స్​లో టికెట్స్​ హాట్​ కేక్స్‌లా అమ్ముడుపోతున్నాయి. ఈక్రమంలో ఆన్​లైన్​ బుకింగ్స్​తో చిరు సినిమా సరికొత్త రికార్డును సాధించింది. కేవలం ఒక్క గంటలోనే 29వేలకుపైగా టికెట్స్​ (Tickets) బుక్​ అయ్యాయి.

విడుదలైన రెండు రోజుల్లోనే ఈ మూవీ రూ. 100 కోట్ల మైలురాయిని దాటింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇది చిరంజీవి రీఎంట్రీని బలంగా సూచిస్తోంది. ఈ సీజన్‌లో అతిపెద్ద సంక్రాంతి (Sankranti) విడుదలగా ఈ చిత్రం మరింత జోరును కొనసాగిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార, కేథరీన్ ట్రెసా, సచిన్ ఖేడేకర్, జరీనా వహాబ్, హర్ష వర్ధన్ కీలక పాత్రల్లో నటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>