కలం, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు (Patancheru) పరిధిలో ఉన్న శ్రీరామ్ ఆటో ఫైనాన్స్ ఆవరణలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫైనాన్స్ వాయిదాలు చెల్లించని వాహనదారుల నుండి స్వాధీనం చేసుకున్న కార్లు, టిప్పర్లను ఈ యార్డులో భద్రపరిచారు. ప్రమాద సమయంలో మంటలు ఒక్కసారిగా చెలరేగి వాహనాలకు వేగంగా వ్యాపించాయి.
ఈ ఘటనలో అనేక కార్లు, భారీ టిప్పర్లు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంటలు అంటుకోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.
Read Also: నా కొడుకు నిప్పు… నిందలు వేసినవాళ్ళను వదిలిపెట్టను: బండి సంజయ్
Follow Us On : WhatsApp

