కలం, వెబ్‌డెస్క్: భారత్‌పై భారీ ఉగ్ర కుట్ర బయపడింది. నిషేధిత జైషే మహ్మద్(జేఈఎం) వ్యవస్థాపకుడు, కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ (Masood Azhar) మాట్లాడిన మాటల ఆడియో ఒకటి లీక్ అయ్యింది. ‘భారత్‌పై ఉగ్రదాడికి వెయ్యి మంది కాదు.. అంతకంటే ఎక్కువ మందే సిద్ధం’ అంటూ ఆ ఆడియోలో మసూద్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ‘భారత్‌పై భారీ ఉగ్రదాడులకు అన్నీ సిద్ధం చేశాం. వేలాది మంది మానవ బాంబర్లు సిద్ధంగా ఉన్నారు. లక్ష్యం కోసం ఆత్మ బలిదానానికి ఎంతో మంది రెడీగా ఉన్నారు. ఎంత మంది సిద్థంగా ఉన్నారో చెప్తే హడలి పోతారు. ఒకరు ఇద్దరు కాదు, వంద కాదు, వెయ్యి కాదు.. అసలు సంఖ్య చెబితే ప్రపంచ మీడియా హడావిడి చేస్తుంది’ అంటూ ఆ ఆడియోలో మసూద్ అజార్ చెప్పడం వినిపిస్తోంది.
కాగా, మసూద్ అజార్ నిత్యం భారత్‌పై విద్వేషం కక్కుతుంటాడు. 2001 పార్లమెంట్‌పై దాడి, 2008 ముంబై ఉగ్రదాడులు సహా అనేక సార్లు భారత్‌తో జరిగిన పేలుళ్ల వెనక మసూద్ అజార్ ఉన్నట్లు భారత దర్యాప్తు సంస్థలు తేల్చాయి. గతేడాది ఆపరేషన్ సింధూర్ సమయంలో త్రుటిలో భారత్ దాడి నుంచి తప్పించుకున్నాడు. అతని కుటుంబానికి చెందిన ముఖ్యులు కొందరు ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. కాగా, 2019 తర్వాత మసూద్ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఐక్యరాజ్యసమితి (UN) మసూద్ అజార్ ను ఉగ్రవాదిగా గుర్తించింది. పాకిస్థాన్‌లో ఉంటూ భారత్‌పై దాడులకు కుట్రలు చేస్తుంటాడు.

Read Also: ‘అయ్యప్ప’ అస్త్రంగా కేరళపై షా గురి
Follow Us On: X(Twitter)


