epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రాజాసాబ్ కి సీక్వెల్ .. బిగ్ అప్‌డేట్ ఇచ్చిన మారుతి..!!

కలం, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్‘(The Rajasaab). టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి(Maruthi) తెరకెక్కించినబిగ్గెస్ట్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. కామెడీ సినిమాలతో తనకంటూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మారుతి మొదటిసారి ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ తో సినిమా చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ గ్రాఫిక్స్, పాన్ ఇండియా రేంజ్ మేకింగ్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో సూపర్ హైప్‌ను క్రియేట్ చేసింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. దీంతో ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రీలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ రీసెంట్ గా ప్రమోషన్లను ప్రారంభించారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూస్ లో పాల్గొంటూ సినిమాకు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలియజేస్తున్నారు.

ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతి(Maruthi) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా, అనుకోకుండా సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ బయటపెట్టారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ‘ది రాజాసాబ్’ ట్రైలర్‌లో ప్రభాస్ జోకర్ లుక్‌లో కనిపించిన విషయం గురించి ప్రశ్నించారు. సాధారణంగా అలాంటి పాత్రలను మళ్లీ చేయడానికి స్టార్ హీరోలు ముందుకు రారని, అలాంటిది ప్రభాస్‌ను ఆ లుక్‌ కోసం ఎలా ఒప్పించారు అని అడిగారు. దీనికి మారుతి బదులిస్తూ ప్రభాస్(Prabhas) జోకర్ లుక్‌లో కనిపించడానికి పెద్ద కథే ఉంది. ఆ కథ మొత్తం “ది రాజాసాబ్ పార్ట్ 2” లో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆ లుక్‌ వెనుక వున్న కథను ప్రభాస్‌కు వివరించగా ఆయన వెంటనే ఒప్పుకున్నారని మారుతి చెప్పుకొచ్చారు. ఈ ఒక్క మాటతో మారుతి అనుకోకుండా ‘ది రాజాసాబ్’కు సీక్వెల్ కూడా ఉంటుందనే విషయాన్ని బయట పెట్టేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>