జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నికలో గెలవడం కోసం కాంగ్రెస్ మరీ దిగజారుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతి ఇంట్లో దొంగఓట్లను చేరుస్తోందని ఆరోపించారు. ఒక ఇంట్లో ఉండేది ఆరుగురు అయితే ఆ ఇంట్లో 22 దొంగ ఓట్లు ఉన్నాయని అన్నారు. బోరబండ పరిధిలోని బంజారా నగర్‌లోని బూత్ నెంబర్ 326 పరిధిలో జగదీష్ రెడ్డి(Jagadish Reddy) పర్యటించారు. ఈ క్రమంలోనే నకిలీ ఓట్ల అంశంపై ఆరా తీశారు. ఒక ఇంట్లో యజమాని సహా 6 మంది ఉంటే ఓటరు లిస్టులో 28 మంది ఉన్నారని అడగగా మిగతా వాళ్ళు ఎవరో నాకు తెల్వదు అంటూ యజమాని సమాధానం ఇచ్చారు. దీంతో నకిలీ ఓట్ల బాగోతం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చని, గెలుపు కోసం కాంగ్రెస్ ఇంతలా దిగజారుతుందనుకోలేదంటూ ఘాటు విమర్శలు చేశారు. వీడియో
Read Also: బీసీ బంద్‌కు కవిత ఫుల్ సపోర్ట్..

