కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట మంగళవారం సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన తాటి మూక అలియాస్ చూటీ (ఏసీఎం దక్షిణ బస్టర్ సప్లై టీమ్) అనే మావోయిస్టు (Maoist Surrender) లొంగిపోయాడు. ప్రభుత్వం ఆపరేషన్ చేయూతలో భాగంగా కల్పించిన సౌకర్యాల పట్ల ఆకర్షితులై సంవత్సర కాలంలో 359 మంది వివిధ హోదాల్లో ఉన్న మావోయిస్టులు లొంగిపోయారు. ఈ రోజు లొంగిపోయిన మావోయిస్టు తాటి మూక కు తక్షణ సహాయంగా 25 వేలు రూపాయలు అందించారు. మిగిలిన రూ.75 వేలు బ్యాంకు ఖాతాలో వేస్తామని ఎస్పీ తెలిపారు.
Read Also: దానం నాగేందర్‌కు స్పీకర్ పిలుపు… రేపు అనర్హతపై విచారణ
Follow Us On: Instagram


