epaper
Wednesday, February 18, 2026
epaper

దానం నాగేందర్‌కు స్పీకర్‌ పిలుపు… రేపు అనర్హతపై విచారణ

కలం, డెస్క్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను (Danam Nagender) రేపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) విచారించబోతున్నారు. బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్లపై రేపు విచారణ జరగనుంది. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే దానం నాగేందర్ కు స్పీకర్ సూచించారు.

గత నెలలో స్పీకర్ ముందు దానం నాగేందర్ (Danam Nagender) అఫిడవిట్ దాఖలు చేశారు. తాను ఏ పార్టీలో చేరలేదని అందులో పేర్కొన్నారు. తనను బీఆర్ ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్టు ఎలాంటి అధికారిక సమాచారం లేదన్నారు. 2024లో కాంగ్రెస్ మీటింగ్ కు తన వ్యక్తిగత హోదాలోనే హాజరు అయ్యానని.. అది పార్టీ మారినట్టు కాదని దానం వాదించారు. రేపు విచారణలో తుది తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపు కేసులో ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ వచ్చిన సంగతి తెలిసిందే.

Read Also: ఈ నెల 23న స్టేట్ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>