కలం/ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా పోలీసులు ఇసుక మాఫియాపై (Sand Mafia) ఉక్కు పాదం మోపుతున్నారు. విస్తృత తనిఖీలు చేపట్టి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న పలు టిప్పర్లను పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న లారీ యాజమాన్యాలపై, ఏజెంట్లు, డ్రైవర్‌లపై కేసులు నమోదు చేశారు. సత్తుపల్లి మండలం గంగారం చెక్ పోస్ట్ వద్ద ఒక టిప్పర్, ఒక ట్రాక్టర్‌ను సత్తుపల్లి పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఏపీలోని కంచికర్ల మండలం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను ఖమ్మం (Khammam) జిల్లా తల్లడ మండలం కుర్నవల్లి గ్రామ శివారులో స్థానిక ఎస్ఐ సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఏపీలోని మల్కాపురం నుండి అక్రమంగా తరలిస్తున్న ఒక ఇసుక ట్రాక్టర్ ను ముదిగొండ పోలీసులు అడ్డుకునీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
Read Also: కొలువుదీరిన బంగ్లాదేశ్ ప్రభుత్వం.. మంత్రిగా హిందూ ఎంపీ
Follow Us On : WhatsApp


