కలం, వెబ్ డెస్క్ : భారత్ పై దాడి చేస్తే కోల్‌కతా వరకు వస్తామంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ (Khawaja Asif) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్ రెండు భాగాలుగా విడిపోయినప్పుడు ఎలాంటి పర్యవసానాలు అనుభవించారో గుర్తుంచుకుని ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయకూడదన్నారు. వారు బెంగాల్ పై కన్నేస్తే పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలుసని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఖవాజా వ్యాఖ్యాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని.. 55 ఏళ్ల క్రితం ఇలాంటి మాటల వల్లే ఆ దేశం రెండు ముక్కలైందన్న విషయాన్ని మర్చిపోవద్దని రాజ్‌నాథ్ (Rajnath Singh) ఎద్దేవా చేశారు. కాగా, భవిష్యత్తులో భారత్ పాకిస్థాన్ పై ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే.. కోల్‌కతాపై దాడి చేసి ప్రతికారం తీర్చుకుంటామని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ చేసిన వ్యాఖ్యలపై వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు పాకిస్థాన్ బెదిరింపు వ్యాఖ్యలను ఖండించే ధైర్యం ప్రధాని మోడీకి, అమిత్ షాకు లేదని టీఎంసీ ఎంపీలు ఆరోపించారు.
Read Also: అవును పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాను.. త్రిష షాకింగ్ కామెంట్స్
Follow Us On : WhatsApp

