కలం, వెబ్ డెస్క్: ‘ఆపరేషన్ కగార్(Operation Agar)’ పేరుతో కేంద్రం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. మావోయిస్టు పార్టీని వచ్చే ఏడాది మార్చి చివరికల్లా భూస్థాపితం చేస్తామని ప్రధాని సహా కేంద్ర హోం మంత్రి పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అందుకు తగ్గట్టుగానే ఆపరేషన్ కగార్ చర్యలను కేంద్ర పారా మిలిటరీ బలగాలు, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా ఉధృతం చేశాయి. ఝార్ఖండ్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, ఏపీ ముఖ్య స్థావరాలపై దాడులు చేసి హిడ్మాలాంటి లాంటి కీలక సభ్యులను మట్టుబెట్టాయి. వరుస ఎన్‌కౌంటర్లు, సరెండర్ల నేపథ్యంలో మావోయిస్టులు ఆకస్మిక దాడులు(Maoist Attacks) చేస్తూ కేంద్ర బలగాలను ధీటుగా తిప్పికొడుతున్నాయి. భారీగా కూంబింగ్ జరుగుతున్న వేళ తగ్గేదేలే అంటూ మావోయిస్టులు ఆకస్మిక దాడులకు దిగడం సంచలనం రేపుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో కాంట్రాక్టర్‌ను హత్య చేసిన ఘటన మరోసారి కేంద్రాన్ని ఉలిక్కి పడేలా చేసింది.
Maoist Attacks | ఆపరేషన్ కగార్‌లో భాగంగా భారీ సంఖ్యలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు సహా రాష్ట్ర, జిల్లా కమిటీల నాయకులు ఆయుధాలతో సహా లొంగిపోతున్నారు. ఇదే సమయంలో మావోయిస్టు పార్టీ దళాలు, మిలీషియా సభ్యులు ఇన్‌ఫార్మర్ల పేరుతో హత్యలు చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. గత వారం మాటుగాసి చేసిన యాక్షన్‌లో ఐదుగురు పారా మిలిటరీ బలగాలు, రాష్ట్ర డీఆర్‌జీ పోలీసులు చనిపోయారు. తాజాగా రోడ్డు పనులు చేస్తున్న ఓ కాంట్రాక్టర్‌ను బీజాపూర్ జిల్లాలో కాల్చి చంపి మృతదేహాన్ని పోలీసు క్యాంపు సమీపంలో పడవేశారు. ఏక కాలంలో సరెండర్లు, గుట్టుచప్పుడు కాకుండా మావోయిస్టులు చేస్తున్న చర్యలతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో కాంట్రాక్టర్‌ను మావోయిస్టులు హతమార్చారు. రోడ్డు నిర్మాణ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీని హత్య చేసిన మావోయిస్టులు మృతదేహాన్ని పామేడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సెక్యూరిటీ క్యాంప్ సమీపంలో విడిచి వెళ్ళారు. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనను పోలీసులు సోమవారం తెల్లవారుజామున గుర్తించారు. ఆ ప్రాంతంలో చాలా కాలంగా ఇంతియాజ్ రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నాడని, ఆకస్మాత్తుగా మావోయిస్టులు కాల్చి చంపి మృతదేహాన్ని అక్కడ వదిలివెళ్ళారని పోలీసులు తెలిపారు. చంపేయడానికి ముందే ఆయనను మావోయిస్టులు అపహరించారని, మిలీషియా సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. ఇంతియాజ్ కనిపించడంలేదని తెలుసుకున్న ఆయన అసిస్టెంట్ వెంటనే స్థానిక పోలీసుల సాయాన్ని కోరాడు. మావోయిస్టులే అపహరించి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఫిర్యాదును అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో ఆలీ మృతదేహం కనిపించింది. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేంద్రం దాడులు చేస్తున్నప్పటికీ.. మావోయిస్టు పార్టీ ఇటీవలనే పీఎల్జీఏ వారోత్సవాలు జరుపుకుంది. ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర-గడ్చిరోలి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని రహస్య ప్రాంతాల్లో ఈ వారోత్సవాలు జరిపింది. ఈ వారోత్సవాల తర్వాత మావోయిస్టులు పైరెండు ఘటనలకు దిగడం సంచలనం రేపింది. దేశంలో పలు చోట్లా కీలక మావోయిస్టులు లొంగిపోతున్నప్పటికీ మావోయిస్టులు దూకుడు చర్యలు దిగడం కేంద్రం బలగాల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.
Read Also: గ్లోబల్ సమ్మిట్‌కు కాంగ్రెస్ MLAలు, MPలు దూరం.. ఎందుకంటే?
Follow Us on: Youtube


