Mobile Popup Ad
Mobile Popup Ad

పవనన్నా కాపాడండి.. మస్కట్‌లో తెలుగు మహిళ ఆవేదన

కలం, వెబ్ డెస్క్ :  ఒమన్‌లోని మస్కట్ (Muscat) నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ మహిళ (AP Woman) కన్నీటి పర్యంతమై విడుదల చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తాను పని కోసం మస్కట్ వెళ్లగా అక్కడ యజమాని తనను నిత్యం తీవ్రంగా వేధిస్తున్నాడని.. గదిలో బంధించి కనీసం అన్నం, నీళ్లు కూడా ఇవ్వకుండా కొడుతున్నాడని వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేసింది.

‘పవనన్నా.. దయచేసి నన్ను కాపాడండి.. నన్ను చంపేస్తారన్నా’ అంటూ ఆ మహిళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) ను కన్నీటితో వేడుకుంది. తనను రక్షించి భారత్‌కు తీసుకురావాలని, అలాగే తన ముగ్గురు పిల్లలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో  సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు.. ఫ్యాన్లకు ‘ఇనుప’ కంచెలు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>