కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. ఒకవైపు పరిపాలన, మరోవైపు రాజకీయ సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. వరుస షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్నా ఆయన నేడు ముంబై, రేపు ఢిల్లీ పర్యటనలకు వెళ్లనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మున్సిపల్ శాఖపై కీలక సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం రాత్రికి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముంబై పయనం కానున్నారు. రేపు ముంబైలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ‘క్లైమేట్ వీక్’ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం సాయంత్రం అక్కడి నుంచి నేరుగా దేశ రాజధాని ఢిల్లీ (Delhi)కి చేరుకుంటారు. ఎల్లుండి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
Read Also: గ్లోబల్ వ్యాక్సిన్ తయారీ సెంటర్ గా హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: X(Twitter)


