కలం, సినిమా : కిరణ్ అబ్బవరం హీరోగా, గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ'(Chennai Love Story) సినిమాపై ప్రేక్షకులలో మంచి ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన మెలోడీ సాంగ్ ‘వదలనే’(Vadhalane) సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. విడుదలైన కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ పాట 3 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. మెలోడీ ప్రేమికులను ఆకట్టుకుంటూ ఈ సాంగ్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ పాటకు సంగీతాన్ని అందించిన మణిశర్మ (Mani Sharma) తనదైన మెలోడీ టచ్‌తో మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆయన స్వరపరిచిన ఈ ట్రాక్‌లో భావోద్వేగాలకు దగ్గరైన ట్యూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సింగర్ జావేద్ అలీ తన మధుర గాత్రంతో ఈ పాటను ఆలపించగా, అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటోంది. ప్రేమలోని భావాలను అద్భుతంగా ప్రతిబింబించేలా లిరిక్స్ ఉండటంతో పాటకు మరింత ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై SKN, సాయి రాజేష్, రవి నంబూరి, ధీరజ్ మొగిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ లేబుల్ టీ-సిరీస్ సౌత్ మంచి ధరకు సొంతం చేసుకుంది.
Read Also: అరటి తొక్కతో చర్మానికి ఇంత మేలు జరుగుతుందా? షాకింగ్ బ్యూటీ టిప్స్
Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

