Mobile Popup Ad
Mobile Popup Ad

మైక్రో ఫైనాన్స్ ఆరోపణలు.. మంగ్లీ సోదరుడి రియాక్షన్ ఇదే

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ సింగర్ మంగ్లి, ఆమె సోదరుడు మైక్రో ఫైనాన్స్ పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్త చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగ్లి సోదరుడు (Mangli Brother) శివ చౌహాన్ తాజాగా మీడియా ముందుకు వచ్చాడు. మైక్రో ఫైనాన్స్ దందాతో తమకు ఏ సంబంధం లేదని చెప్పుకొచ్చారు. కావాలంటే తాము బాధితుల పక్షాన కూడా కొట్లాడతామని చెప్పారు. తన సోదరి మంగ్లి ఎదుగుదలను ఓర్వలేకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఎఫ్ఐఆర్‌లో మా పేరు ఉందా?

ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ లో తన పేరు కానీ తన సోదరి మంగ్లి పేరు కాదని శివ చౌహాన్ చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బండి శివ అని తాను కాదని చెప్పుకొచ్చారు. బండి శివ మంగ్లి సోదరుడు అంటూ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. తన మీద విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారని.. తాము ఈ విషయం మీద లీగల్ గా ఫైట్ చేస్తున్నామన్నారు. తన కులదైవం తుల్జా భవాని సాక్షిగా తమ కుల గురువు సేవాలాల్ సాక్షిగా, ఆంజనేయ స్వామి సాక్షిగా తనకు ఏ పాపం తెలియని.. ఏ విచారణకైనా తాను సిద్ధమని శివ చౌహాన్ చెప్పుకొచ్చారు.

నిజానిజాలు బయటకు రావాలి

“మేము ఎలాంటి తప్పు చేయలేదు. ఎవరికైనా అనుమానాలు ఉంటే, అవి నిరూపించాలి. నిరూపిస్తే మేము ఎక్కడికైనా వచ్చి విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం,” అని ఆయన సవాల్ విసిరారు. నిజానిజాలు బయటపడాలనే తమ కోరిక అని తెలిపారు. అదేవిధంగా, ఈ కేసులో రాజకీయ కోణం కూడా ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే తమ పేరును లాగుతున్నారని పేర్కొన్నారు. అయితే దీనిపై స్పష్టత రావాలంటే సమగ్ర విచారణ జరగాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>