ఆన్‌లైన్ లోనే అన్ని ప్రభుత్వ సేవలు : సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్ లైన్ ద్వారానే అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, వాట్సప్ గవర్నెన్స్ పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని మన మిత్ర పరిధిలోకి తీసుకువస్తే ప్రభుత్వ సేవల కోసం ప్రజలు గవర్నమెంట్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని చెప్పారు. మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ సర్వీస్ ద్వారా 1035 ప్రభుత్వ సేవలు అందిస్తున్నట్లు ఆయన అధికారులకు వివరించారు. ఇప్పటి వరకు 54 లక్షలకు పైగా ప్రజలు ఈ సేవలను వినియోగించుకున్నారని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>