కలం, వెబ్ డెస్క్: నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) ఆసక్తికరమైన విషయాన్ని ఇన్‌స్టాలో షేర్ చేశాడు. తన భార్య మౌనికతో కలిసి ఆటోలో ప్రయాణించిన వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భార్యతో కలిసి మనోజ్ జిమ్‌కు వెళ్లాడు. సడన్‌గా కారు ట్రబుల్ ఇవ్వడంతో ప్లాన్‌ను మార్చుకున్నాడు. ఇంటికి వెళ్లేందుకు ఆటోను ఆశ్రయించాడు. సాధారణంగా సెలబ్రిటీలు ఆటోల్లో, బహిరంగ ప్రదేశాల్లో ప్రయాణించడానికి ఇష్టపడరు.
కానీ మంచు మనోజ్ మాత్రం తన భార్యతో ఆటోలో చక్కెర్లు కొట్టాడు. ‘ఈ రోజు కారు మాది కాదు.. ఆటో టైమ్’ అంటూ ఎంజాయ్ చేశాడు. హైదరాబాద్‌లో చలి విపరీతంగా ఉందని, వింటర్ సీజన్‌ను బాగా ఆస్వాదించానని చెప్పాడు. ప్రశాంతమైన వాతావరణం, నిశ్శబ్ద రోడ్లు కొత్త అనుభూతిని ఇచ్చాయన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘హీరో కాదు.. రియల్ హీరో’, అన్నా.. ఆటో డ్రైవర్‌కు నీవు ఎవరో తెలుసా? అంటూ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: సంక్రాంతి ముగ్గులేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి!
Follow Us On: X(Twitter)


