కలం వెబ్ డెస్క్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) సోమశిల ప్రాజెక్టు(Somashila Project) సందర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నెల్లూరు(Nellore)లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేతల పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy) సహా పలువురు నేతలను హౌస్ అరెస్ట్(House Arrest) చేశారు. దీంతో భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు కాకాణి ఇంటికి చేరుకున్నారు. కాకాణి వైసీపీ కార్యకర్తలతో కలిసి తన ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లా (Nellore) లోని ముఖ్య నేతల ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకాణి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న తమను అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు.
Read also: సెన్సార్ బోర్డుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Twitter


