కలం, వెబ్‌డెస్క్: మేనేజర్ రూబెన్ అమోరిమ్‌కు (Ruben Amorim) మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ భారీ షాక్ ఇచ్చింది. మేనేజర్‌గా తీసుకున్న 14 నెలలకే అతన్ని తొలగించింది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని క్లబ్ సోమవారం ప్రకటించింది. జట్టు ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని మార్పు అవసరమని యునైటెడ్ యాజమాన్యం తెలిపింది. క్లబ్, అమోరిమ్ చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం బర్‌న్లీతో జరగనున్న మ్యాచ్‌కు అండర్ 18 జట్టు కోచ్ డారెన్ ఫ్లెచర్ తాత్కాలికంగా నాయకత్వం వహించనున్నాడు.
లీడ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్ 1–1తో ముగిసిన తర్వాత యునైటెడ్ ప్రీమియర్ లీగ్ పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఆ మ్యాచ్ తర్వాత అమోరిమ్ మీడియా సమావేశంలో తాను కేవలం కోచ్ కాదు, మేనేజర్ అని స్పష్టంగా చెప్పారు. స్కౌటింగ్ విభాగం మరియు ఫుట్‌బాల్ డైరెక్టర్ పనిని చేయాలని సూచించారు.
నవంబర్ 2024లో మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టిన అమోరిమ్, మేలో బిల్బావోలో యూరోపా లీగ్ ఫైనల్‌కు జట్టును తీసుకెళ్లినా టైటిల్ సాధించలేకపోయారు. గత సీజన్ ప్రీమియర్ లీగ్‌లో 15వ స్థానంలో ముగిసింది. 14 నెలల పదవీకాలంతో అమోరిమ్ మాంచెస్టర్ యునైటెడ్ చరిత్రలో అతితక్కువ పనిచేసిన శాశ్వత మేనేజర్లలో ఒకరిగా నిలిచారు. 2013 తర్వాత యునైటెడ్ ఇప్పటివరకు ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలవలేకపోయింది.

Read Also: ఆ ఇద్దర్ని టెన్షన్ పెడుతున్న రాజాసాబ్..
Follow Us On: X(Twitter)


