epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఆ ఇద్దర్ని టెన్షన్ పెడుతున్న రాజాసాబ్..

కలం, వెబ్​ డెస్క్​ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ (Raja Saab). మారుతి తెరకెక్కించిన ఈ హర్రర్ మూవీ టీజర్ మరియు ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీపై మరింత క్రేజ్ పెరిగింది. అయితే రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ ఇద్దరిలో టెన్షన్ స్టార్ట్ అయ్యిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు?

మారుతి మేకింగ్‌పై ప్రశంసల జల్లు

ప్రభాస్ బాహుబలి తర్వాత అన్నీ భారీ మాస్ అండ్ యాక్షన్ సినిమాలే చేశారు. అయితే ఆయన్ని అభిమానులు మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ సినిమాల్లో చూసినట్టుగా ఎంటర్టైనింగ్ రోల్ లో చూడాలనుకుంటున్నారు. అభిమానులు కోరుకుంటున్నట్లుగానే మారుతి ది రాజాసాబ్ స్టోరీని డిజైన్ చేశాడు. ఇక ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఈ మూవీపై మరింత క్రేజ్ పెరిగింది. మారుతితో ప్రభాస్ సినిమా అనగానే సినిమా వద్దు బాబాయో అంటూ సోషల్ మీడియాలో పెద్ద ట్రెండింగ్ నడిచేలా చేశారు. కానీ ప్రభాస్ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ఈ సినిమా చేశాడు. ట్రైలర్ చూసిన తర్వాత వావ్ మారుతి బాగానే తీశాడే అనే టాక్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే మారుతిని విమర్శించిన జనాలే శభాష్ మారుతి అంటూ అభినందిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వస్తుంది.

చిరు, వెంకీల క్రేజీ కాంబినేషన్

సంక్రాంతికి వస్తున్న మరో భారీ క్రేజీ మూవీ మన శంకర్ వరప్రసాద్. అపజయం అనేది లేకుండా వరుసగా సక్సెస్‌ఫుల్ మూవీస్ చేస్తూ దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కించడం, పైగా ఇందులో చిరుతో కలిసి వెంకటేష్ కూడా నటించడంతో మరింత క్రేజ్ పెరిగింది. ఇక ట్రైలర్ అయితే చిరును ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లినట్టు అనిపించింది. చిరు, నయనతారపై చిత్రీకరించిన సీన్స్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. ఆడియన్స్ థియేటర్ లో బాగా ఎంజాయ్ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక చిరు, వెంకీ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం, వీరిద్దరిపై చిత్రీకరించిన సీన్ వేరే లెవల్లో ఉండడంతో మరింత క్రేజ్ ఏర్పడింది.

రీమేక్ ముద్రతో వెనకబడ్డ జననాయగన్

సంక్రాంతికి వస్తున్న మరో మూవీ కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన జననాయగన్. దీనికి హెచ్ వినోద్ డైరెక్టర్. ఈ సినిమా బాలయ్య భగవంత్ కేసరి మూవీకి రీమేక్ అంటూ ప్రచారం జరిగింది. మేకర్స్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోవడంతో ఇది నిజమా కాదా అనేది సస్పెన్స్‌గా ఉండేది. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి భగవంత్ కేసరి మూవీకి ఇది రీమేక్ అనేది క్లారిటీ వచ్చేసింది. అంతే కాకుండా సీన్ టు సీన్ అలా దింపేయడంతో మరీ ఇంతలా తీశారేంటి అనే విమర్శలు ఎక్కువ అయ్యాయి. ఇది విజయ్ ఆఖరి సినిమా కావడంతో తెలుగులో కూడా బజ్ ఉండేది. అయితే భగవంత్ కేసరి రీమేక్ కావడంతో అంతగా క్రేజ్ లేదు అనేది వాస్తవం.

సంక్రాంతి రేసులో రాజాసాబ్ పైచేయి

సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో రాజాసాబ్ (Raja Saab), మన శంకర్ వరప్రసాద్, జననాయగన్ ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. ఈ మూడు ట్రైలర్స్ లో మన శంకర్ వరప్రసాద్ గారు ట్రైలర్ బాగుంది కానీ పెద్దగా చెప్పుకోవడానికి కొత్తదనం ఏమీ లేదు అనే టాక్ వచ్చింది. జననాయగన్ భగవంత్ కేసరిని అలా దింపేశారనే టాక్ వచ్చింది. ఇక రాజాసాబ్ ట్రైలర్‌కే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో మన శంకర్ వరప్రసాద్, జననాయగన్ చిత్ర యూనిట్లకు టెన్షన్ స్టార్ట్ అయ్యిందని టాక్. మరి సినిమాలు రిలీజ్ అయితే ఎలా ఉంటుందో, ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవుతుందో చూడాలి.

Read Also: రాజాసాబ్ పార్ట్ 2 నిజంగా ఉంటుందా?

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>