రోడ్డు దాటుతుండగా ఢీ కొట్టిన కారు.. వ్యక్తి మృతి

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని బూర్గంపాడు మండలం జింకల గూడెం క్రాస్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న కారు బలంగా ఢీ కొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామానికి చెందిన ధారావత్ కిషన్ అనే వృద్ధుడు, జింకలగూడెం క్రాస్ వద్ద రోడ్డు దాటుతుండగా, కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కిషన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అకస్మాత్తుగా ఊహించని ప్రమాదం జరగడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>