ఏషియ‌న్ గ్రూప్ చైర్మ‌న్ కుమార్తె వివాహం.. త‌ర‌లివ‌చ్చిన టాలీవుడ్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత‌, ఏషియ‌న్ గ్రూప్ చైర్మ‌న్ సునీల్ నారంగ్ (Suniel Narang) కుమార్తె సిమ్రాన్ వివాహ రిసెప్ష‌న్ వేడుక శ‌నివారం రాత్రి హైద‌రాబాద్‌లో అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. సిమ్రాన్‌, క్రిష్ జంట‌ను ఆశీర్వ‌దించేందుకు టాలీవుడ్ నుంచి ప్ర‌ముఖులు, రాజ‌కీయ నేత‌లు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. నారంగ్ కుటుంబ‌స‌భ్యులు అతిథుల‌ను సాద‌రంగా ఆహ్వానించారు. గ‌తంలో సైతం సునీల్ నారంగ్ త‌న మ‌రో ఇద్ద‌రు కుమార్తెల పెళ్లిళ్లు ఎంతో ఘ‌నంగా చేశారు. ఈ వేడుక కూడా అదే స్థాయిలో వైభవంగా జ‌రిగింది.

ఈ వేడుక‌లో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని ఫ్యామిలీ, సమంత దంప‌తులు, మాస్ మహారాజా రవితేజతో పాటు ప‌లువురు అగ్ర నటీనటులు, నిర్మాతలు, దర్శకులు హాజ‌రై నూతన దంపతులను ఆశీర్వదించారు. టాలీవుడ్ హీరోహీరోయిన్లు అంద‌రూ ఒకే వేడుక‌కు రావ‌డంతో ఈ పెళ్లి వేడుక పండుగ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించింది. సోష‌ల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్‌గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>