epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సీఎం ఇంటి ముందు వృద్ధుడి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!

క‌లం వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu) స్వ‌గ్రామం నారావారిప‌ల్లెలో (Naravaripalle) విషాద‌క‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. సీఎం ఇంటి ముందే ఓ వృద్ధుడు ఆత్మ‌హ‌త్యాయత్నానికి పాల్ప‌డ్డాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. సంక్రాంతి  వేడుక‌ల‌ కోసం సీఎం చంద్ర‌బాబు కుటుంబ‌స‌మేతంగా నారావారిప‌ల్లెకు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో చంద్రబాబుతో తమ సమస్యలను చెప్పుకునేందుకు చిత్తూరు జిల్లా రాజయ్యగారిపల్లికి చెందిన గోవిందరెడ్డి(65) అనే వృద్ధుడు వ‌చ్చాడు. సీఎంను క‌ల‌వాల‌ని ప్ర‌య‌త్నించాడు. అక్క‌డే ఉన్న పోలీసుల‌ను ప‌లుమార్లు అడిగాడు కానీ, వారు అనుమ‌తించ‌లేదు. ఈ క్ర‌మంలో పోలీసులు వృద్ధుడితో దురుస‌గా ప్ర‌వ‌ర్తించ‌డంతో ఆయ‌న‌ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నారావారిపల్లెలోని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అక్క‌డి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్ర‌స్తుతం వృద్ధుడికి చికిత్స కొన‌సాగుతోంది.

Read Also: భోగి మంటల్లో వైయ‌స్ జ‌గ‌న్ హ‌యాం పాస్ పుస్త‌కాలు!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>