కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో జర్నలిస్టుల వరుస అరెస్టుల విషయమై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) స్పందించారు. బుధవారం ఆయన డీజీపీ శివధర్ రెడ్డితో (DGP Shivadhar Reddy) ఫోన్‌లో మాట్లాడారు. ‘‘అర్ధరాత్రి పండుగ పూట జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్ళి తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం అవసరమా? ప్రొసీజర్ అనుసరించకుండా నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టులు చేస్తారు? జర్నలిస్టులు ఏం క్రిమినల్స్ కాదు టెర్రరిస్టులు కాదు? వారిపట్ల ఎందుకు అంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు. వాళ్ల కుటుంబాలు మానసిక వేదనకు గురవుతాయి, పండుగ పూట అరెస్టులు సరికాదు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి’’ అని హరీశ్ రావు కోరారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మీడియాతో మాట్లాడారు. పండుగ వేళ రేవంత్ రెడ్డి జర్నలిస్టులను అరెస్ట్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, మంత్రులపై మీడియాకు లీకులు ఇచ్చి వాళ్ళని కంట్రోల్‌లో పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు. కొంతమందిని జర్నలిస్టులను (Journalists) బలిపశువులను చేస్తున్నరని మెతుకు ఆనంద్ విమర్శించారు.

Read Also: రాహుల్ హామీ బేఖాతర్.. నల్లగొండలో ‘రెడ్డి’లదే పెత్తనం!!
Follow Us On: X(Twitter)


