epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

18 కిలోలు తగ్గిన అమీర్ ఖాన్, ఎందుకో తెలుసా

కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్‌లో ప్రయోగాలు చేయడంలో హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) ముందుంటాడు. ఈ స్టార్ తన తదుపరి ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభించలేదు. ఈ గ్యాప్‌లో ఆయన 18 కిలోల బరువు తగ్గాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. తన మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ప్రధాన పాత్రలో నటిస్తున్న హ్యాపీ పటేల్ చిత్రంలో ఆయన అతిథి పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రంలో అమీర్ ఒక హాస్య పాత్రలో నటించాడు. ఈ మూవీ కోసమే ఆయన 18 కిలోల బరువు తగ్గాడని వార్తలొచ్చాయి.

బాలీవుడ్ (Bollywood) మీడియా ప్రకారం.. అమీర్ ఖాన్ త్వరలో తన అభిమాన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీతో కలిసి దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో నటించనున్నారు. ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. కానీ అమీర్ ఖాన్ ఈ ఏడాది మార్చిలో సెట్‌లో అడుగుపెట్టనున్నాడు. ఇందుకోసమే ఆయన ప్రత్యేకమైన డైట్‌ను ఫాలోవుతున్నాడు. దాదాసాహెబ్ ఫాల్కేగా పరిపూర్ణంగా కనిపించేలా రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రాజ్ కుమార్ హిరానీ స్క్రిప్ట్ కోసం అనేక మార్పులు చేశారు.

Aamir Khan
Aamir Khan

Read Also: టీజర్ వివాదం.. టాక్సిక్ బ్యూటీ ఇన్‌స్టా డిలీట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>