ఎన్నికల ముందు మరో పెహల్గామ్ ఘటన: మమతా బెనర్జీ

కలం, వెబ్ డెస్క్: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల (West Bengal Elections) వేళ రాజకీయం వేడెక్కింది. బీజేపీ, టీఎంసీ మధ్య తీవ్రస్థాయిలో డైలాగ్ వార్ నడుస్తోంది. టీఎంసీ అరాచకాలు సాగనివ్వబోమని ప్రధాని మోడీ హెచ్చరించారు. మమతా బెనర్జీ (Mamata Banerjee) పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కాగా తాజాగా మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల కంటే ముందే దేశంలో పెహల్గాం లాంటి ఘటన జరుగుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. బెంగాల్ ఎన్నికలకు ముందు “మరో పహల్గామ్ తరహా దాడికి బ్లూప్రింట్ సిద్ధంగా ఉందా?” అంటూ ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్‌లోని ఓ బహిరంగ మాట్లాడిన మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కోల్‌కతాపై దాడి చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు స్పందించలేదు. కారణం ఏమిటి? ఎన్నికలకు ముందు మరో పహల్గామ్ దాడికి ప్రణాళిక రచించారు? అని వ్యాఖ్యానించారు.

ఢిల్లీ దాడులకు తీవ్రంగా స్పందిస్తాం

ఢిల్లీ నుంచి బెంగాల్ ప్రజలను తాను రక్షించుకుంటానని మమతా పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటే తాము ఎదురుదాడి చేస్తామని హెచ్చరించారు. “కోల్‌కతాపై దాడి చేస్తామని ఎవరైనా మాట్లాడితే భారతీయులుగా మేము ఊరుకోము.” అని హెచ్చరించారు.

మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం డ్రామాలు: బీజేపీ

మమత వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ ప్రతినిధి ప్రదీప్ భండారి ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. మైనారిటీ ఓటు బ్యాంక్‌ను ఆకర్షించడానికే మమతా బెనర్జీ (Mamata Banerjee) ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని ‘స్క్రిప్ట్’ లేదా ‘బ్లూప్రింట్’గా వ్యాఖ్యానించడాన్ని బట్టి మమతా ఆలోచన విధానం ఎటువంటిదో తెలుస్తుందన్నారు. పెహల్గాంలో నిరపరాధ హిందువుల హత్యను తక్కువ చేసి చూపుతున్నారని విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్‌ను “యాంటీ-హిందూ” పార్టీగా అభివర్ణించారు.

Read Also:  మంత్రి సొంత జిల్లాలో మంచినీళ్ళకు కరువు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>