కలం, వెబ్ డెస్క్: ఎన్నికల కౌంటింగ్ (Vote Counting) నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తన పార్టీ శ్రేణులకు అత్యవసర పిలుపునిచ్చారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆమె ఆదేశించారు. ప్రతి దశలోనూ ఈవీఎంల పనితీరును, లెక్కింపు ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. జాతీయ మీడియాలో వస్తున్న బీజేపీ అనుకూల ఎగ్జిట్ పోల్స్ లేదా ఫలితాల ట్రెండ్‌లను చూసి నిరాశ చెందవద్దని కోరారు. ‘సూర్యాస్తమయం తర్వాత అసలైన విజయం మనదే అవుతుంది, పులి పిల్లల్లా పోరాడండి’ అని పేర్కొన్నారు. తుది ఫలితం వెలువడే వరకు లెక్కింపు కేంద్రాలను వదలవద్దని ఆమె పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు.
Read Also: తారుమారైన ఐదు రాష్ట్రాల ఫలితాలు.. కేసీఆర్‌పై భారీగా ట్రోల్స్!
Follow Us On : WhatsApp

