తారుమారైన ఐదు రాష్ట్రాల ఫలితాలు.. కేసీఆర్‌పై భారీగా ట్రోల్స్!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ రాణించాలనే లక్ష్యంతో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, పినరయ్ విజయన్‌కు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో  కేసీఆర్ వ్యూహాలపై మరోసారి సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే క్రమంలో ఆయన మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, వైఎస్ జగన్, స్టాలిన్ వంటి హేమాహేమీలను కలిశారు. అయితే విచిత్రంగా ఆయన ఎవరినైతే కలిశారో, ఆయా పార్టీల నేతలు వరుసగా పరాజయాలను చవిచూశారు. తాజాగా బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ చూస్తుంటే, కేసీఆర్ కలిసిన నేతలందరూ ఓటమి దిశగా వెళ్తున్నారని, ఆయన వెళ్లిన చోటల్లా ‘రివర్స్ సెంటిమెంట్’ వర్కౌట్ అవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో నెటిజన్లు కేసీఆర్‌పై (KCR) ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్నారు. ‘జాతీయ రాజకీయాలను (National Politics) శాసిస్తానన్న కేసీఆర్ తనతో చేతులు కలిపిన ప్రతి ఒక్కరినీ నిండా ముంచేశారు’ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి 100శాతం స్ట్రైక్ రేట్ అంటూ చురకలంటిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో తమ పార్టీ ప్రభావం చూపిస్తుందని గొప్పలు చెప్పుకున్నా, చివరకు తను కలిసిన మిత్రపక్షాల విజయవకాశాలను కూడా దెబ్బతీశారంటూ కామెంట్లు చేస్తున్నారు. అందరినీ ‘SUCCESSFUL గా నాకించేశావ్ గా వాపు’ అంటూ విమర్శలు చేస్తున్నారు.

Read Also: నువ్వా నేనా.. రాష్ట్రంలో పొలిటికల్​ హీట్​!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>