సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చినంత గౌరవం, మర్యాద హీరోయిన్లకు ఇవ్వరని స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే(Pooja Hegde) అంటోంది. తెలుగులో స్టార్‌డమ్ అందుకున్న ఈ బుట్టబొమ్మ కొంతకాలంగా అమ్మడు బాలీవుడ్‌లో బిజీబిజీగా ఉంది. వరుస సినిమాలతో అక్కడే సెటిల్ అయ్యింది. ఏదో చుట్టపుచూపుకు అన్నట్లు ఒక పాటకో, చిన్న కామియోగానే దక్షిణాది సినిమాల్లో కనిపిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా.. ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హీరోల కంటే హీరోయిన్లు అంటే ఇండస్ట్రీలో చిన్న చూపే ఉంటుందని చెప్పింది. హీరోలకు ఇచ్చినంత గౌరవ, మర్యాదలు హీరోయిన్లకు దక్కవని తెలిపింది.
‘‘హీరోలకు సెట్స్ దగ్గరే క్యారవాన్లు ఉంటాయి. కానీ, హీరోయిన్లకు అలా కాదు. సెట్స్ దూరంగా ఎక్కడో ఉంటాయి. అక్కడి వరకు మేం మేకప్‌తో పాటు కాస్ట్యూమ్ వేసుకుని నడుచుకుంటూ వెళ్లాలి. కొన్ని సార్లు బరువైన బట్టలు వేసుకున్నప్పుడు నడవడం చాలా కష్టమవుతుంది. హీరోలకు ఇచ్చినట్లు పర్సనల్ స్టాఫ్‌ను కూడా మాకేమీ ఇవ్వరు. హీరోల ఇష్టాలకు, అభిప్రాయాలకు ఉన్నంత ఇంపార్టెన్స్ మాకు ఉండదు. వాళ్లు చెప్తే ఎలాంటి మార్పులు అయినా చేసేస్తారు. కానీ మేం చెబితే ఎవరూ సరిగ్గా పట్టించుకోరు. మమ్మల్ని కేవలం గ్లామర్ల వరకే పరిమితం చేసుకుంటారు. అది కొన్ని సార్లు ఇబ్బందిగా అనిపించింది. కానీ సినిమాపై ప్రేమతో చేస్తుంటాం’’ అని పూజా హెగ్దే(Pooja Hegde) చెప్పుకొచ్చింది.
Read Also: తొక్కిసలాట బాధితులను కలవనున్న విజయ్..

