దీదీ రాజీనామా చేయకపోతే పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది?

కలం, నేషనల్ డెస్క్: వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా.. సీఎం పదవికి రాజీనామా ప్రసక్తే లేదని మమతా బెనర్జీ (Mamata Banerjee)  స్పష్టం చేశారు. సాధారణంగా ఎన్నికల్లో ఓటమి పాలైనప్పుడు సీఎంలు నైతిక బాధ్యత వహిస్తూ రిజైన్ చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె పదవిలో కొనసాగాలని నిర్ణయించుకోవడంతో రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠ నెలకొన్నది. ఈ క్రమంలో ఒకవేళ మెజారిటీ సాధించిన పార్టీ లేదా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైతే, గవర్నర్ జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది.
– మమతా బెనర్జీ ప్రభుత్వ పదవీ కాలం మే 7తో ముగుస్తున్నది. తర్వాత ఆమె సీఎం పదవిలో కొనసాగడానికి వీల్లేదు. రాజీనామా చేయకపోయినా ఆమె ప్రభావం ఉండదు.

– అసెంబ్లీని రద్దు చేసే అధికారం గవర్నర్కు ఉంటుంది. ఐదేండ్ల పదవీ కాలం పూర్తి కాగానే ప్రభుత్వం ఆటోమేటిక్గా ముగిసినట్లే.
– మమతా బెనర్జీ (Mamata Banerjee) రాజీనామా చేయకపోయినా.. రాజ్యాంగ ప్రక్రియల ప్రకారం.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అవుతుంది.
– కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సభను గవర్నర్ సమావేశపరిచి బలపరీక్ష నిర్వహించి బలం నిరూపించుకోవాలని ఆదేశించొచ్చు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఎలానూ బలం లేదు కాబట్టి ప్రభుత్వం పడిపోతుంది.
– ఒకవేళ సీఎం తన మెజారిటీని నిరూపించుకోలేకపోయినా.. లేదా రాజీనామా చేయకపోయినా.. గవర్నర్‌కు మంత్రిమండలిని రద్దు చేసి మెజారిటీ సీట్లు సాధించిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించొచ్చు.
– ఏ పార్టీకీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ సిఫార్సు చేయొచ్చు.

Read Also: బీజేపీ కీలక నిర్ణయం.. బెంగాల్ కు మహిళ సీఎం.. !

Follow Us On :  WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>