మమతా బెనర్జీకి బిగ్‌షాక్‌.. ఎన్డీయేలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు

కలం, వెబ్ డెస్క్: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత, బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీకి (Mamata Banerjee) ఆ పార్టీ ఎంపీలు బిగ్‌షాక్‌ ఇచ్చారు. కోల్ కతాలోని కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ నివాసంలో బెంగాల్‌ సీఎం సువేందు అధికారితో టీఎంసీ (TMC) ఎంపీలు సమావేశమయ్యారు. ఆపరేషన్‌ బెంగాల్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ కూడా పాల్గొన్నారు. గతవారం రోజులుగా ఆయన కోల్ కతాలోనే ఆయన మకాం వేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సువేందుతో 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు టచ్‌లో ఉన్నారు.

ఈ క్రమంలోనే బెంగాల్‌లో అధికారంలో ఉన్న ఎన్డీయేకు మద్దతివ్వాలని తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీయేకు (NDA) 20 మంది తృణమూల్ ఎంపీలు మద్దతిస్తామని ఆ పార్టీ నాయకురాలు, ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు 20 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు లేఖ రాశారు. స్పీకర్‌‌ను నేడు లేదా రేపు కలిసి తమను ప్రత్యేక గ్రూప్‌గా పరిగణించాలని కోరనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీలో చీలిక ఖాయమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Read Also: విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాల‌ని ఇండియా కూట‌మి తీర్మానం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>