కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) లో భారీ పేలుడు సంభవించింది. స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ – 1 లో జరిగిన ఘటనలో ఈ ఘటనలో పలువురికి గాయాలవ్వగా వారిని ఆస్పత్రికి తరలించారు. పేలుడు దాటికి సీసీడీ విభాగంలో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్టీల్ ప్లాంట్ వద్దకు చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ద్రవ ఉక్కు పదార్థం మీద పడడంతో క్రేన్ దగ్ధమయింది. లాడెల్ నుంచి ఉక్కు నేలపై పడడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో సీసీడీ ప్లాంట్ లో 8 మంది కార్మికులు ఉన్నట్లు తోటి కార్మికులు చెబుతన్నారు.
Read Also: రేపు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్
Follow Us On: Sharechat

