Deepak Chahar – Malti Chahar | హిందీ బిగ్ బాస్ హౌస్‌లోకి రెండో వైల్డ్ కార్ట్ ఎంట్రీ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తాజాగా వచ్చిన ప్రోమో ఈ షోపై అంచనాలను అమాంతం పెంచింది. ఇప్పటికే వైల్డ్ కార్డ్‌పై ఎంట్రీ ఖరారయింది. కొంతకాలంగా వైల్డ్ కార్డ్‌తో ఎవరు ఎంట్రీ ఇస్తారు? అన్నది హాట్ టాపిక్‌గా ఉంది. కాగా ఈ ప్రశ్నకు తాజా ప్రోమో ఆన్సర్ చెప్పింది. ఈ ప్రోమోలో సల్మాన్ ఖాన్(Salman Khan).. తొలుత దీపక్‌కు స్టేజ్‌పైకి పిలుస్తాడు. అనంతరం ‘ఈ సీజన్‌లో రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు అనేది ఆడియన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. మీ కుటుంబం అంతా ఈ షోను స్టడీ చేసి ఉంటుంది కదా?’’ అని ప్రశ్నించాడు. దానికి స్పందించిన చాహర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
‘‘నాకు తెలిసి క్రికెట్ కన్నా ఈ షోలో ఆడటం చాలా కష్టం. ఎందుకంటే ఈ హౌస్‌లో శత్రువు ఎవరో, మిత్రుడు ఎవరో మనకు తెలియదు’’ అని చెప్పాడు. అనంతరం గెలిచే అవకాశం ఉందా? అని సల్మాన్ ప్రశ్నించగా.. లోపలికి వెళ్లి కొన్ని రోజులు ఉన్న తర్వాత దానికి ఆన్సర్ చెప్పగలనని అన్నాడు దీపక్. అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుంది దీపక్ చాహర్ కాదు.. అతని సోదరి మాళతీ చాహర్(Malti Chahar). దీపక్ తర్వాత మాళతి ఎంట్రీ కూడా ఈ ఎపిసోడ్‌లో ఉంటుంది.

