‘టీమిండియాలో హర్షిత్ రాణా(Harshit Rana).. పర్మనెంట్ ప్లేయర్. ఎవరు ఉన్నా లేకున్నా అతడు పక్కాగా ఉంటాడు. అందుకు ఆస్ట్రేలియా టూర్‌కు సెలక్ట్ చేసిన టీ20, వస్డే సిరీస్ జట్లే నిదర్శనం’ అని టీమిండియా మాజీ ప్లేయర్ కృష్ణమాచారి శ్రీకాంత్(Krishnamachari Srikanth) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం టీమిండియా.. ఆస్ట్రేలియా టూర్‌కు సన్నద్ధం అవుతోంది. ఈ టూర్‌లో కంగారూలతో వన్డే, టీ20 సిరీస్‌లలో ఆడనుంది. ఈ సిరీస్‌లకు జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అక్టోబర్ 19 నుంచి మొదలైయ్యే ఈ టూర్‌లో సీనియర్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్ శర్మకు అవకాశం దక్కింది. వారు కాకుండా టీ20, వన్డే జట్లలో కామన్‌గా ఒక ప్లేయర్ ఉన్నాడు. అతడే హర్షిత్ రాణా. రెండు జట్లలో హర్షిత్ ఉండటంపై శ్రీకాంత్ తాజాగా స్పందించాడు. హర్షిత్ రాణా.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) తాలుకా అని, భారత జట్టులో హర్షిత్‌ది పర్మినెంట్ ప్లేస్ అని విమర్శించాడు శ్రీకాంత్.
‘‘టీమిండియాలో రాణా(Harshit Rana) శాశ్వత ప్లేయర్. గంభీర్‌కు అతనంటే ఇష్టం. అందుకే హర్షిత్‌కు గంభీర్ చాలా ప్రాధాన్యం ఇస్తాడు. దాని వల్లే జట్టు జాబితాలో గిల్ తర్వాత హర్షిత్ పేరే ఉంటుంది. ఆల్‌రౌండర్ కోటాలో పాండ్యకు రీప్లేస్‌గా నితీశ్ కుమార్ రెడ్డిని తీసుకున్నాడు. అతడు మెరుగైన ప్రత్యామ్నాయం కాదు. జడేజా(Jadeja).. బెస్ట్ ఆల్‌రౌండర్. అతడిని తీసుకోలేదు. వచ్చే వన్డే వరల్డ్ కప్ ప్లానింగ్‌లో కూడా ఉంటాడని నేను అనుకోవట్లేదు’’ అని శ్రీకాంత్ అన్నాడు.

